Friday, September 08, 2006
శని శుభాశుభాలు - 1
శని పేరెత్తితే చాలామందికి భయం. ఇబ్బందిపెట్టేవారిని "శనిగాడు" అని దూషించడం కూడా కద్దు."మీకు ప్రస్తుతం శని జరుగుతోంది."అని జ్యోతిష్కుడు అన్నాడో లేదో జాతకుడికి గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. నిజానికి శని అంత భయంకరమైన గ్రహమేమీ కాదు. శనే కాదు, ఏ గ్రహమైనా ఆ జాతకానికి ఎన్నో అధిపతి ? ఎక్కడ ఉన్నాడు ? అనేదానిమీదే శుభాశుభాలు ఆధారపడి ఉంటాయి.
శని కొన్ని జాతకాలకి చాలా మేలు చేస్తాడు. ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం తీసుకుంటే అందులో శని తులారాశిలో మహోచ్ఛంలో ఉన్నాడు. అందువల్ల ఆయనకి తిరుగులేని ప్రజాదరణ, దిగంత విశ్రాంత కీర్తి ప్రతిష్ఠలు లభించాయి. శని ఆ స్థితిలో ఎవరి జాతకంలో ఉన్నప్పటికీ వారి చుట్టూ అలా ఒక సమ్మోహన వలయం ఏర్పడుతుంది.అయితే వారు ఏ రంగంలో తమ ప్రాభవం (domination) వెలిగిస్తారనేది మిగతా గ్రహాల్ని బట్టి చెప్పాలి. విదేశయానంలో శని పాత్ర కాదనలేనిది. అలాగే ఆయుర్దాయానికి సైతం శనిస్థితి చాలా ముఖ్యం. వివాహం కూడా సాధారణంగా శనిగోచారంలోనో, శని యొక్క దశా-అంతర్దశల్లోనో సంభవించడం మనం గమనిస్తాం. శని అనుగ్రహం పొందినవారికి ఆయన వందలాది, వేలాదిమంది సేవకుల్ని, ఉద్యోగుల్ని సమకూర్చి పెడతాడు.మనం చూసే మెగా కార్పొరేషన్‌లని స్థాపించిన పారిశ్రామికవేత్తల జాతకాల్లో శని అత్యుత్తమస్థితిలో ఉండడం కనిపిస్తుంది.

శని సూర్యుడి నుంచి 142 కోట్ల 70 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహం. మన ప్రాచీన గ్రంథాల్లో దాన్ని "వాయుతత్త్వ గ్రహం" అని పేర్కొనగా, ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు Gas giant అంటున్నారు. అంటే భూమిలో లాగా శనిలో మట్టీ, శిలలూ లేవట. 99 శాతం వాయువులే (gases) ఉన్నాయట. దీని వ్యాసం చుట్టుకొలత లక్షా 20 వేల కిలోమీటర్లు.ఇది భూమికంటే 736 రెట్లు పెద్దది. బరువులో మాత్రం 94 రెట్లే పెద్దది. శని చుట్టూ అంతుపట్టని రంగురంగుల వలయాలు ఉండడం చేత ఆయనకి Lord of rings అనే ముద్దుపేరు కూడా ఉంది.
మన పురాణాల ప్రకారం- శని సూర్యుడికీ, ఆయన చిన్న భార్య అయిన ఛాయాదేవికీ జన్మించినవాడు. (పెద్ద భార్య ఎవరు ? ఎందువల్ల సూర్యుడు ఛాయాదేవిని చేసుకోవాల్సి వచ్చింది ? అంటే అదో పెద్ద కథ)అంటే యమధర్మరాజుకి స్వయానా సోదరుడు. యముడు కర్తవ్యపాలనా నిష్ఠకి ప్రతీక కాగా, శని శ్రమజీవనానికి అధిపతి. అందుచేత శనికి కార్మిక, కూలీ వర్గాల పట్ల పక్షపాతం ఎక్కువ. ఆ కారణం వల్ల మన పూర్వీకులు శనిని శూద్రగ్రహంగా పరిగణించారు. శూద్రుడు కావడం చేత శని ఒంటిరంగు నలుపు. నలుపంటే మరీ కారునలుపు కాదు, కొంచెం నీలం కలిసిన నలుపు. తాను స్వయంగా నీలి-నలుపు కావడాన శనికి ఆ రంగులు గలవన్నీ చాలా ఇష్టం. ఇంద్రనీలమణి, నల్లబట్టలు, నీలం బట్టలు, నల్ల నువ్వులు, తుప్పుపట్టని ఇనుము, చీకటి, నల్లని మనుషులు, నల్లరాళ్ళూ వగైరా ! సూర్యుడు కాల స్వరూపుడు, యముడు మృత్యుదేవత కాగా శని ఆయుర్దాయ దేవత.(అవస్థాభేదాలే తప్ప, నిజానికి ఇవన్నీ ఒకటే నని గ్రహించాలి)
'శనికి ఒక కాలు కుంటి' అని మన పూర్వీకుల అభిప్రాయం. (సౌరి శ్శనైశ్చరో మందః) అందుకనే ఆయన అతినెమ్మదిగా సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడట.దానివల్ల ఆయన యొక్క మహాదశాకాలం (20 సంవత్సరాల శుక్రుడు తప్ప)మిగతా అన్ని గ్రహాల దశాకాలాల కంటే బహుదీర్ఘమైనది (19 సంవత్సరాలు). సూర్యుడిది 6 సంవత్సరాలు, చంద్రుడిది 10 సంవత్సరాలు, కుజుడిది 7 సంవత్సరాలు మాత్రమే.శనికున్న లక్షణాల్లో ఈ మందత్వం (నెమ్మదితనం) చాలా ప్రధానమైనది. శని ప్రభావం జాతకాల్లో అమితంగా ఉన్నప్పుడు దీనిమూలంగా నీరసం, నిరాశ, సోమరితనం, మందకొడితనం, బద్ధకం, ఏం చెప్పినా తొందరగా గ్రహించలేకపోవడం, ఒక పని చేసేటప్పుడు తీసుకోవాల్సినదానికంటే రెట్టింపు సమయం తీసుకోవడం జరుగుతుంది. మందుడు కావడం మూలాన శని కూడా తానిచ్చే ముఖ్యమైన శుభాశుభ ఫలితాలన్నీ తన దశ చివర్లోనే ఇస్తూంటాడు. ఈ లక్షణం బృహస్పతికి కూడా ఉంది. కాని ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. "Saturn may delay, but will not deny." అంటారు పెద్దలు. అంటే శని శుభ ఫలితాలివ్వడానికి ఆలస్యం చేస్తాడు, కాని అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టడు. "కుంటి కులాసం ఇంటికి మోసం" అనే సామెత చొప్పున శనికీ, ఆయన తండ్రి అయిన సూర్యుడికీ ఎందుకో గాని బద్ధశత్రుత్వం ఉంది.అందువల్లనే శనిరాశులైన మకర కుంభాల్లో జన్మించినవారికి కూడా తమ తల్లిదండ్రులతో పడదని జ్యోతిష్కులంటారు.
Comments:
<< Home
iam lakshminarasimha reddy my date of birth is aug 14 1985. tell me about my jathakam.when iam get job
Namaste Vydehi Mam Garuki
Reference telugujaathakam.blogspot.com , I Yaddanapudi Vijaya Bhaskar, DOB:05/05/1969 Time 9.50 to 10.00 pm , correctly time not having in that period, pl help me, i am suffering lot of problem, specially career side, any grahdosh is there in my side, pl suggest me, presently staying in hyderabad, pl help me. if any appointment, personally i can met you.
Yours faithfully
Vijaya Bhaskar
9393058183
Post a Comment