Wednesday, September 20, 2006

 
దేనివల్ల ఈ ముసలం ?

ప్రత్యేక తెలంగాణా గురించి చర్చలు జరుగుతున్న రోజులివి.ముగిసిపోయిందనుకున్న ఒక వేర్పాటువాద అధ్యాయం మళ్ళీ 30 ఏళ్ళ తరువాత తెరుచుకోవడం పట్ల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాని ప్రస్తుతం ప్రచారమౌతున్న తెలంగాణావాదం 1969-71ప్రాంతాలతో పోలిస్తే మరీ అంత చెడ్డది కాదని అందరూ ఒప్పుకోవాలి.పాపం !ప్రస్తుత తెలంగాణావాదులు అహింసామార్గంలోనే ప్రజాస్వామికంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని కృషిచేస్తున్నారు.

దానికీ జ్యోతిశ్శాస్త్రానికీ సంబంధమేంటి ?అని మీరు అడుగుతారు. అదే చెప్పాలనుకుంటున్నాను. కేసీయార్‌గారు అన్న ఒక మాట మాత్రం నిజం."ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించకుండా తెలంగాణావారిని ఎవరూ ఆపలేరు.కేసీయార్ కాకపోతే మరో పీసీయార్ వచ్చి ఉండేవాడు."గ్రహస్థితి నిజంగా అలాగే ఉంది.అయితే గ్రహస్థితులన్నీ తాత్కాలికమేనని మర్చిపోకూడదు.

ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతకం పరిశీలిద్దాం.

ఆంధ్రప్రదేశ్ జన్మలగ్నం మీనం. లగ్నాధిపతి అయిన గురుడు లగ్నం నుంచి ఏడో ఇల్లయిన కన్యలో నీచపడ్డ శుక్రుడి (తృతీయాధిపతి అన్నదమ్ములకి కారకుడు)తో కలిసి తృతీయ స్థానమైన వృషభాన్ని చూస్తున్నాడు.ఇది అన్నదమ్ముల మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలకి దారి తీసే గ్రహస్థితి.అందుచేత ప్రతి పది ఇరవై ఏళ్ళకి ఒకసారి తెలుగువారు ఇలా దెబ్బలాడుతూనే ఉంటారు."రాష్ట్రం ముక్కలవుతుందేమో ! " అని ఎప్పటికప్పుడు అనిపిస్తుంది. కాని ఎప్పటికీ ముక్కలు కాదు.ఎందుకంటే లగ్నాధిపతి అయిన గురుడు మూడో దృష్టితో తన స్వంతరాశి(మీనం) అయిన లగ్నాన్ని కూడా చూస్తున్నాడు.ఎవరి లగ్నం మీదైనా గురుదృష్టి పడిందంటే వారు విపరీతంగా లావెక్కుతారు.అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా ఎప్పటికీ లావుగానే (పెద్ద రాష్ట్రంగానే) ఉంటుంది కాని చిన్న రాష్ట్రాలుగా ముక్కలవ్వడం మాత్రం జరగదు.ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఇచ్చినా కూడా అది అలా ఎక్కువ కాలం కొనసాగదు.మళ్ళీ తొందరగానే ఆంధ్రప్రదేశ్‌లో విలీనమౌతుంది.

జాతకచక్రం కాకుండా కాలచక్రాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు కాలచక్రంలో ప్రస్తుతం మీనరాశి దశ నడుస్తోంది.ఇది 1981 లో మొదలై 2016 దాకా నడుస్తుంది. మీనరాశికి అధిపతి అయిన గురుడే ఆంధ్రప్రదేశ్‌కి లగ్నాధిపతి.ఈ గురుగ్రహం (Jupiter)సాక్షాత్తు భగవంతుడితో సమానంగా పరిగణించబడుతోంది.గురుడు బ్రాహ్మణ గ్రహం. విద్యలకి అధిపతి దొంగతనాలకి ప్రేరకుడు. శాంత స్వభావుడు. నెమ్మది గలవాడు. కాని వాగ్వాదాలంటే చెవి కోసుకుంటాడు. భోజనప్రియుడు. స్థూలకాయుడు. బంగారు మేనిచాయ గలవాడు. అందుచేత ఆయనకి పసుప్పచ్చ అత్యంత ప్రీతిపాత్రం.

1981నుంచి రాష్ట్రంలో జరుగుతూ వచ్చిన పరిణామాలన్నీ గురు గ్రహ ప్రభావం చేతనే.ఎందుకంటే తన లగ్నంలో జన్మించిన వారికి ఏ గ్రహమైనా తన దశలో భారీ లాభాలు చేకూరుస్తుంది.అందువల్ల 1983లో తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో ఒక పసుప్పచ్చ పార్టీ అధికారంలోకి వచ్చింది.దానితో తెలుగువారికిష్టం లేని "మద్రాసీ" అనే బిరుదు కాలగర్భంలో కలిసింది.ఈ మీనరాశి దశలో ఆంధ్ర ప్రభుత్వానికి అంతకుముందు సంప్రదాయంలా మారిపోయిన రాజకీయ అస్థిరత్వానికి తెరపడింది.తరువాత అరుదైన గ్యాస్ పెట్రోలియం యురేనియం నిక్షేపాలు ఆంధ్రాలో బయట పడ్డాయి. విద్యలకి ఆంధ్రా ప్రధాన కేంద్రమైంది.విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఇది ఎంత స్థాయిలో జరిగిందంటే BITS, Pilani లో 80 శాతం మంది విద్యార్థులు తెలుగువారే అయ్యేంతగా. 4,600 IIT సీట్లలో 800 పైగా ఆంధ్రా విద్యార్థులే సాధించుకునేంతగా.విమానాశ్రయాలు కూడా పెరిగాయి.అలానే తెలుగు క్రీడాకారులకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ప్రారంభమైంది.తెలుగు సినిమాలు ఆంధ్రా దాటి ఖండాంతరాల్లో వందలాది థియేటర్లలో విడుదలవ్వడం మామూలైంది.అంతకంటే ముఖ్యమైన విషయం-గురుగ్రహ ప్రభావం చేత 1981నుంచి ఆంధ్రులంతా గురు (షిరిడీ సాయిబాబా)భక్తులుగా మారిపోయారు.

శనిలాగా గురుడు కూడా తన దశ యొక్క ఆఖరి సంవత్సరాల్లో ఎక్కువ ఫలితాలిస్తాడు.కనుక ఈ పురోగమనం 2010 నుంచి ఇంకా ఇంకా విజృంభిస్తుంది.

కాని ఆ కాలంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి.మనం మానసికంగా సిద్ధపడి ఉండాలి.విశాలహృదయులు ఆవేదనకి లోనౌతారు.తమిళనాడులాగా ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దురభిమానులతో నిండిపోతుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ కూడా బాగా మారిపోయే అవకాశం ఉంది.గవర్నరు ముఖ్యమంత్రి మొదలైన పదవులు (designations) పరిణామం చెందుతాయి.

ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పడం కుదరదు.

Comments:
this is toooo nice.
I learned so many things.

thank u.
 
చాల బాగుంది
నా జాతకం గూర్చి చెప్పరూ
పుట్టిన సమయం :3:22 ఉదయం
పుట్టిన తేది :10.06.1967
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?